ఇంజినీర్లు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ..

- March 15, 2016 , by Maagulf
ఇంజినీర్లు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలంటూ  ఆదేశాలు జారీ..

-నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు ఆదేశాలు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు మరింత వేగంగా, నాణ్యతతో జరిగేందుకు కావాల్సిన చర్యల్ని చేపట్టడంపై నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టిసారించారు. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇంజినీర్లు తమ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటేనే నిర్ణీత సమయంలో పనులు మంచిగా జరుగుతాయని మంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజినీర్లు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. బుధవారం ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీర్లకు ఆదేశాలు వెళ్లనున్నట్లు సమాచారం. ఇంజినీర్లు ఒకవేళ తమకు సంబంధించిన హెడ్‌క్వార్టర్స్‌లో లేనట్లయితే హెచ్‌ఆర్‌ఏ (హౌజ్ రెంట్ అలవెన్స్) కట్ చేస్తామని కూడా ఆదేశాల్లో హెచ్చరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com