18 ఏళ్లు నిండిన వారికి ఆస్ట్రాజెన్కా బూస్టర్ షాట్
- September 07, 2021
బహ్రెయిన్: దేశ ప్రజల్లో ఇమ్యూనిటీ స్థాయిని పెంచేందుకు అర్హులైనవారికి బూస్టర్ షాట్ ఇవ్వనున్నట్లు కోవిడ్ నియంత్రణ కోసం ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో అస్ట్రాజెన్కా బూస్టర్ షాట్ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. అయితే..అస్ట్రాజెన్కా రెండో డోసులను తీసుకొని ఆరు నెలలు దాటిన 18 ఏళ్లకుపైబడిన వారు బూస్టర్ షాట్ కు అర్హులు అని స్పష్టం చేసింది. అలాగే 60 ఏళ్లకుపైబడిన వారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి కూడా బూస్టర్ షాట్ తీసుకునేందుకు అర్హులు అని టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. బూస్టర్ షాట్ కు అర్హులైన వ్యక్తులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ http://healthalert.gov.bhలేదా BeAware అప్లికేషన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!