తెలంగాణ కరోనా అప్‌డేట్..

- September 07, 2021 , by Maagulf
తెలంగాణ కరోనా అప్‌డేట్..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 68,097 శాంపిల్స్‌ పరీక్షించగా… 298 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.ఇదే సమయంలో.. 325 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,60,142కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 6,50,778కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి మృతి చెందిన వారి సంక్య 3,888కు చేరినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 89 నమోదు కాగా.. కరీంనగర్‌లో 24, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో, వరంగల్‌ అర్బన్‌లో 21 చొప్పున కేసులు వెలుగు చూశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com