కార్ నడిపిన 12 ఏళ్ల బాలుడు..కార్ సీజ్

- September 08, 2021 , by Maagulf
కార్ నడిపిన 12 ఏళ్ల బాలుడు..కార్ సీజ్

కువైట్: కువైట్ లో పన్నెండేళ్ల బాలుడు డ్రైవ్ చేసిన SUV లగ్జరీ కారును పోలీసులు సీజ్ చేశారు. అతని కుటుంబంపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు కేసును రిఫర్ చేశారు. ఓ పన్నేండేళ్ల పిల్లాడు తన మూడేళ్ల సోదరుడిని వెంటబెట్టుకొని SUV లగ్జరీ కారును డ్రైవ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన కువైట్‌లోని సబా అల్ అహ్మద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే..వైరల్ అయిన వీడియో చివరికి పోలీసుల దృష్టికి వెళ్లింది. చట్టపరంగా పన్నెండేళ్ల బాలుడు డ్రైవ్ చేయటం నిబంధనలను ఉల్లంఘించటమే. దీంతో బాలుడు నడిపిన SUV కారును సీజ్ చేసిన పోలీసులు..అతని కుటుంబంపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com