ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేసిన తాలిబాన్లు

- September 11, 2021 , by Maagulf
ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేసిన తాలిబాన్లు

కాబూల్: అఫ్ఘాన్ లో అధికారం అయితే దక్కించుకున్నారు కానీ, ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ముహూర్తాలు చూసుకుంటున్నారు తాలిబాన్లు. ముందుగా అమెరికాలో ట్విన్ టవర్స్ పేలుళ్లు జరిగిన సెప్టెంబర్ 11 (9/11)న రోజునే ప్రమాణ స్వీకారం చేయాలని ప్లాన్ చేయారు. 20వ వార్షికోత్సవం సందర్భంగా చేయాలని భావించి.. మళ్లీ రద్దు చేసుకున్నారు.

‘కొత్త అఫ్ఘాన్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కొద్ది రోజుల క్రితం రద్దు అయింది. ప్రజలను కన్ఫ్యూజ్ చేయకూడదనే ఉద్దేశ్యంతో.. ఇస్లామిక్ ఎమిరేట్ లీడర్ షిప్ క్యాబినెట్ గురించి ప్రకటించేసింది. పని కూడా మొదలుపెట్టేశాం’ అని అప్ఘాన్ ప్రభుత్వ కల్చరల్ కమిషన్ సభ్యులు ఇనాముల్లా సమంగనీ అన్నారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రష్యా, ఇరాన్, చైనా, ఖతర్, పాకిస్తాన్ ల ప్రముఖుల్ని ఆహ్వానించారు తాలిబాన్లు. 9/11 రోజున న్యూ కాబుల్ గవర్నమెంట్ ప్రమాణ స్వీకారోత్సవం జరిపితే తాము పాల్గొనమని కొన్ని దేశాలు చెప్పేశాయి.

అమెరికాతో పాటు దాని అనుబంధ దేశాలు ఖతర్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. 9/11రోజున జరగకుండా చేయాలని చెప్పాయి. ఈ మేరకే తాలిబన్లకు ఖతర్ నుంచి సూచనలు వచ్చాయి. ఆ తర్వాత చర్చలు జరిగి ఎలాగైతే సెప్టెంబర్ 11న జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com