బహ్రెయిన్: కార్మికులు ధైర్యంగా ఉండండి-మంత్రి అప్పల రాజు

- September 12, 2021 , by Maagulf
బహ్రెయిన్: కార్మికులు ధైర్యంగా ఉండండి-మంత్రి అప్పల రాజు

ఏపీ: గత రెండు రోజులుగా బహ్రెయిన్ లో శ్రీకాకుళం నుండి  వెల్లిన వలస కూలీల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, సమాచార మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే ఆదివారం రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు బాదితులతో మాట్లాడారు.బహ్రెయిన్ లో పనులకు వెల్లిన వారి పరిస్థితి ఫోన్ లో అడిగి తెలుసుకున్నారు.అందరూ జాగ్రత్తగా పని చేసుకోవాలని అప్పటికి ఇబ్బందులు ఎదురైతే తనకు స్వయంగా ఫోన్ చేయాలని మంత్రి డాక్టర్ అప్పలరాజు ఫోన్ నెంబరు వారికి ఇచ్చారు. ఎవైనా ఇబ్బందులు ఉంటే అక్కడ ప్రభుత్వంతో మాట్లాడే విదంగా APNRTS ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీ కి తెలియజేస్తాని హామీ ఇచ్చారు. అక్కడ ఉండటానికి బాదగా ఉంటే మన ప్రాంతానికి వచ్చేయాలని అనుకున్న వారు తెలియపరిస్తే తప్పకుండా వారికి క్షేమంగా వారి వారి ఇళ్ళకు చేర్చేందుకు ప్రభుత్వం తరుపున మాట్లాడి తీసుకువస్తామని అన్నారు. భయాందోళన చెంది ఎవరూ అభద్రతా భావానికి లోనవ్వకుండా ధైర్యంగా ఉండాలని కోరారు.బాధిత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన విషయం వారికి తెలిపారు. అందురూ క్షేమంగా ఉండాలని కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. ఎవరికి ఏటువంటి ఇబ్బందులు ఎదయరైనా ఫోన్ చేసి మీ సమస్యలు తెలియజేయాలని కోరారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి మన మనుషులను కాపాడుకుంటామని పూర్తిస్థాయి గా దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com