సౌదీ:విమాన ప్రయాణికులకు ఎంట్రీ రూల్స్ అప్ డేట్
- September 14, 2021
సౌదీ: దేశంలోకి ప్రవేశించే విమాన ప్రయాణికులకు సంబంధించి ఎంట్రీ రూల్స్ ను అప్ డేట్ చేసింది సౌదీ ప్రభుత్వం. కరోనావైరస్ మహమ్మారిని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా..క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ విధానాలను ప్రకటించింది. ఈ మేరకు కింగ్డమ్ వచ్చే ప్రయాణీకులు దేశంలో అనుమతి పొందిన వ్యాక్సిన్ లలో ఏదైన ఒక వ్యాక్సిన్ ను ఒక డోసు తీసుకున్నట్లయితే..వారు తప్పకుండా పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ ను సమర్పించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల లోపల తీసుకున్న రిపోర్ట్ లను మాత్రమే అనుమతిస్తారు. కింగ్డమ్ చేరుకున్నాక.. ప్రయాణీకుడు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు సంస్థాగత నిర్బంధంలో ఉండాలి. అలాగే దేశానికి చేరుకున్న తొలి 24 గంటలలోపు అదేవిధంగా ఐదవ రోజు కూడా PCR టెస్ట్ చేయించుకోవాలి. తవక్కల్నా యాప్ లో వారి రిపోర్టులను అప్డేట్ చేయాలి.
ఇక రెండు కోర్సులు తీసుకున్న ప్రయాణికులతో ఉండే మైనారిటీ వయసు వారు ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకుంటే..ఐదు రోజులు హోం క్వారంటైన్లో ఉండాలి. ఐదో రోజు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.
పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు తప్పనిసరిగా సంస్థాగత నిర్బంధంలో ఉండాలి. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఆమోదించని సినోఫార్మ్, సినోవాక్ టీకాలు తీసుకున్న వ్యక్తులు కింగ్డమ్ వచ్చిన తర్వాత దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లలో బూస్టర్ డోస్ పొందాలి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







