సెక్యూరిటీ చేతికి పెప్పర్ స్ప్రే...కువైట్ ఆమోదం

- September 14, 2021 , by Maagulf
సెక్యూరిటీ చేతికి పెప్పర్ స్ప్రే...కువైట్ ఆమోదం

కువైట్ సిటీ: దేశంలోని పలు విభాగాలకు చెందిన భద్రతా సిబ్బంది పెప్పర్ స్ప్రేని ఉపయోగించడానికి కువైట్ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. అంతర్గత మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు గస్తీ పోలీసులు, ప్రజా భద్రత, అత్యవసర, ట్రాఫిక్, నేర పరిశోధనలతో అన్ని విభాగాల భత్రత సిబ్బందికి పెప్పర్ స్ప్రే గన్స్ ను ఇవ్వనున్నారు. అయితే వాంటెడ్ లిస్ట్ లో ఉన్న నేరస్తులు పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించిన సందర్భాల్లో పెప్పర్ స్ప్రే గన్స్ ప్రయోగించొచ్చు. 

నేరస్తులను అదుపు చేసేందుకు..నిరసనలు అదుపు తప్పినప్పుడు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రపంచంలోని పలు దేశాలలో ఇప్పటికే పెప్పర్ స్ప్రే వినియోగం అమలులో ఉంది. పెప్పర్ స్ప్రే కొనుగోలుకు సంబంధించి ఆర్డర్ పూర్తయిందని, మరికొన్ని వారాల్లోనే కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. భద్రతా సిబ్బందిపై దాడులను అరికట్టేందుకు అనుసరించాల్సిన విధానాలపై గత జూలైలో అంతర్గత మంత్రిత్వ శాఖ 8 సమావేశాలను నిర్వహించిందని, దాడులు నివారణకు హాట్ పెప్పర్ స్ప్రేని ప్రవేశపెట్టడం,  ఎలక్ట్రిక్ లాఠీని వినియోగించడం వంటి అంశాలను అప్పట్లో చర్చించామని, అందుకు అనుగుణంగానే పెప్పర్ స్ప్రే వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com