భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- September 16, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.సెంకండ్ వేవ్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు.గత కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టినా మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో 30,570 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 3,33,47,325కి చేరింది. ఇందులో 3,25,60,474 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,42,923 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనా నుంచి 38,303 మంది కోలుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 431 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,43,928కి చేరింది. కరోనా నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. 24 గంటల్లో భారత్‌లో 64,51,423 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.దీంతో దేశంలో ఇప్పటి వరకు 76,57,17,137 మందికి టీకాలు వేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…
- సౌదీ అరేబియా: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి..
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..







