ఫ్రీలాన్సర్ కేటగిరిలో కంప్యూటర్ సిస్టమ్స్, సాఫ్ట్ వేర్ డిజైన్
- September 16, 2021
అబుధాబి: ఎమిరేట్స్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి లక్ష్యంగా అబుధాబి ఎకనామిక్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫ్రీలాన్సర్ లైసెన్స్ కేటగిరిలో మార్పులు చేసింది. ఫ్రీలాన్సర్ లైసెన్స్ విభాగంలో కంప్యూటర్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ డిజైనింగ్ లను జత చేసింది. అంటే ఫ్రీ లాన్సర్ లైసెన్స్ ఉన్నవారు ఫ్రీ జోన్లలో స్వయం ఉపాధి పొందవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు అబుధాబిలోని కంపెనీలతో పాటు ఫ్రీ జోన్లతో ఒప్పందం చేసుకోవటం, స్వయం ఉపాధి పనులు చేసే హక్కు ఉంటుంది. ఈ ఫ్రీ లాన్సర్ లైసెన్స్ కోసం యూఏఈ పౌరులు, నివాసితులు, విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుదారులు తమ నైపుణ్యాలను నిరూపించుకుంనేందుకు విద్య, వృత్తిపరమైన అనుభవానికి సంబంధించిన ధృవపత్రాలను సమర్పించవచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







