చురుగ్గా సాగుతున్న చైనా సొంత స్పేస్‌ స్టేషన్‌ పనులు

- September 20, 2021 , by Maagulf
చురుగ్గా సాగుతున్న చైనా సొంత స్పేస్‌ స్టేషన్‌ పనులు

బీజింగ్‌: మానవరహిత స్పేస్‌క్రాఫ్ట్‌ను చైనా సోమవారం లాంచ్‌ చేసింది. అంతరిక్షంలో ఆ దేశం నిర్మిస్తున్న సొంత స్పేస్‌ స్టేషన్‌కు అవసరమైన సామగ్రిని ఇందులో పంపింది. దక్షిణ చైనా హైనాన్ ప్రావిన్స్‌లోని వెంచాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుండి లాంగ్ మార్చ్‌ 7 రాకెట్‌ను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రయోగించింది. చైనా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్‌కు సామగ్రిని సరఫరా చేయడానికి కార్గో అంతరిక్ష నౌక టియాన్‌జౌ -3ను దీని ద్వారా పంపినట్లు చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ (CMSA) పేర్కొన్నట్లు అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ మిషన్‌కు సంబంధించిన 11 ప్రయోగాల్లో ఇది నాలుగోవదని వెల్లడించింది. చైనా సొంత స్పేస్‌ స్టేషన్‌ టియాంగాంగ్ 2022 నాటికి అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com