భారత్ కరోనా అప్డేట్

- September 27, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది.సెకండ్ వేవ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న‌ది. అయితే, రాబోయే 4నుంచి 6 వారాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్‌ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో కొత్త‌గా 26,041 కేసులు న‌మోద‌య్యాయి.దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,36,78,786కి చేరింది.ఇందులో 3,29,31,972 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,99,620 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 276 మంది మృతి చెందారు.దీంతో భారత్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 4,47,194 మంది మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో భారత్‌లో 29,621 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 38,18,362 మంది వ్యాక్సిన్ లు తీసుకున్నారు.  దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 86,01,59,011 మంది వ్యాక్సిన్ లు తీసుకున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com