RR పై SRH విజయం

- September 27, 2021 , by Maagulf
RR పై SRH విజయం

దుబాయ్‌: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకుమరో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిన దశలో సన్‌రైజర్స్‌కు ఊరట విజయం లభించింది. గత మ్యాచ్‌లో 121 పరగులు ఛేదించలేక చతికిల పడిన ఎస్‌ఆర్‌హెచ్ రాజస్థాన్‌పై 166 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి కేవలం 18.3 ఓవర్లలోనే ఛేదించింది, దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జేసన్ రాయ్ (60) అర్ద సెంచరీతో అదరగొట్టగా.. కేన్ విలియమ్‌సన్ (51) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో అభిషేక్ శర్మ (21) వేగంగా పరుగులు తీయడంతో సన్‌రైజర్స్ అలవోకగా విజయం సాధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com