సఫాత్ స్క్వేర్ లోని ఓ టవర్ లో అగ్నిప్రమాదం

- October 08, 2021 , by Maagulf
సఫాత్ స్క్వేర్ లోని ఓ టవర్ లో అగ్నిప్రమాదం

కువైట్ : కువైట్ సిటీలోని సఫాత్ స్క్వేర్ వద్ద ఓ టవర్ లో అగ్నిప్రమాదం జరిగింది. టవర్ ను కూల్చివేస్తుండగా హఠాత్తుగా ప్రమాదం జరిగింది. 15 అంతస్తుల ఈ భవనంలో మూడో ఫ్లోర్ లో మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించటంతో వెంటనే అక్కడి చేరుకున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురు వర్కర్స్ ను ఫైర్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక మిగతా ఫ్లోర్ లలో ఉన్న వర్కర్స్ ను కూడా సేఫ్ గా బయటకు తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమేంటన్ని తెలియాల్సి ఉంది. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com