భారతీయులకు శుభవార్త చెప్పిన బ్రిటన్
- October 08, 2021
లండన్: భారతీయులకు బ్రిటన్ అధికారులు శుభవార్త చెప్పారు.గతంలో కోవీషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ బ్రిటన్ వచ్చే భారతీయులు తప్పని సరిగా 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని షరతులు విధించిన సంగతి తెలిసిందే.దీనిపై భారత్ ప్రభుత్వం సీరియస్ అయింది.ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతులు పొందిన వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా 10 రోజులు క్వారంటైన్ విధించడం సమంజసం కాదని, క్వారంటైన్ ఆంక్షలు విధిస్తే తాము కూడా అదే బాటలో నడుస్తామని ప్రకటించింది.దీంతో బ్రిటన్ ప్రభుత్వం దిగివచ్చింది. షరతులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది.ఎత్తివేసిన షరతులు ఈనెల 11 నుంచి అమలులోకి వస్తాయని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







