సహాయక చర్యల్లో పాల్గొనేందుకు నార్త్ అల్ బతినా వెళ్ళిన 15,000 మందికి పైగా వాలంటీర్లు

- October 08, 2021 , by Maagulf
సహాయక చర్యల్లో పాల్గొనేందుకు నార్త్ అల్ బతినా వెళ్ళిన  15,000 మందికి పైగా వాలంటీర్లు

మస్కట్: సుమారు 15,000 మంది వాలంటీర్లు, నార్త్ అల్ బతినాకి వెళ్ళి అక్కడ షహీన్ తుపాను కారణంగా నష్టపోయినవారికి సాయం చేసేందుకు, ఆ ప్రాంతంలో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు చర్యలు చేపట్టారు. రాయల్ ఆర్ముడ్ ఫోర్సెస్‌తో కలిసి ఈ వాలంటీర్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని రిలీఫ్ మరియు షెల్టర్ సెక్టార్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ అహ్మద్ అల్ రియామి చెప్పారు. నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా ప్రాంతాల్లో తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది. రోడ్లను పరిశుభ్రంగా వుంచడం, బాధితులకు ఆహారాన్ని అందించడం సహా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com