అపర కుబేరుల సరసన చేరిన ముకేశ్ అంబానీ
- October 09, 2021
ముంబై: ప్రపంచ మేటి సంపన్నుల జాబితాలో ముఖేశ్ అంబానీ చేరారు. జెఫ్ బేజోస్, ఎలన్ మస్క్ లాంటి హేమాహేమీల సరసన ఆయన నిలిచారు. కనీసం వంద బిలియన్ల డాలర్లు కలిగి ఉన్న సంపన్నుల లిస్టులో ముఖేశ్ చేరడం గమనార్హం. బిలియనీర్ల ఎక్స్‌క్లూజివ్ క్లబ్‌లో మొత్తం 11 మంది ఉన్నారు. ముఖేశ్ ఆ జాబితాలో చోటు సంపాదించారు. ఇప్పుడు ముఖేశ్ ఆస్తుల విలువ సుమారు 100.6 బిలియన్ల డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొన్నది. బ్లూమ్‌బర్గ్ ప్రకారం ఈ ఏడాది 23.8 బిలియన్ల డాలర్లను ముఖేశ్ ఆర్జించారు. సంపన్నుల జాబితాలో మస్క్, బేజోస్ తర్వాత బెర్నార్డ్ అర్నాల్ట్, బిల్ గేట్స్, ల్యారీ పేజ్, మార్క్ జుకర్‌బర్గ్, సెర్గే బ్రిన్, లారీ ఎలిసన్, స్టీవ్ బాల్మర్, వారెన్ బఫెట్, ముఖేశ్ అంబానీలు ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







