హజ్,ఉమ్రా యాత్రికుల కోసం..బయోమెట్రిక్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్
- October 14, 2021సౌదీ అరేబియా: కువైట్ కు చెందిన హజ్, ఉమ్రా యాత్రికుల బయోమెట్రిక్ సెల్ఫ్ నమోదును సౌదీ అరేబియా ప్రారంభించినట్టు సౌదీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి చెప్పారు.ట్యునీషియా, మలేషియా, యూకే, బంగ్లాదేశ్ పౌరులకు కూడా బయోమెట్రిక్ నమోదు విధానం అందుబాటులో ఉంటుందన్నారు.ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉమ్రా వీసాలు పొందాలనుకునే వారు తమ బయోమెట్రిక్ నమోదు చేసుకోవడానికి వ్యక్తిగతంగా రాయబార కార్యాలయాలు లేదా పోలీస్ స్టేషన్లకు వెళ్లవలసిన అవసరం లేదు.వారు తమ బయోమెట్రిక్‌లను వారి స్మార్ట్ ఫోన్లలో యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.బయోమెట్రిక్ మ్యాచింగ్ ప్రాసెస్ విజిటర్స్ సౌదీ వచ్చిన సమయంలో జరుగుతుందన్నారు. వీసా, ట్రావెల్ సొల్యూషన్స్ కోసం ఉపయోగించే బయోమెట్రిక్ సెల్ఫ్ నమోదు సర్వీసును సౌదీ కంపెనీ రూపొందించిందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?