వరుణ్ తేజ్, శ్రీనువైట్ల చిత్రంలో కథానాయిక హెబా
- March 18, 2016
మెగా హీరో వరుణ్ తేజ్, శ్రీనువైట్ల, నల్లమలపు బుజ్జి, మిక్కి జే మేయర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. విజయ్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహారించనున్నాడు. ఇలా టెక్నికల్ టీం మొత్తాన్ని సిద్ధం చేసుకున్న దర్శకుడు ఈ చిత్రంలో నటించనున్న కథానాయికలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే లావణ్య త్రిపాఠి పేరు వినిపిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్గా హెబా పటేల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. 'కుమారి 21 ఎఫ్' సినిమాతో కుర్రకారును కిర్కెక్కించిన హెబాపటేల్ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఆ కోవలోనే తాజాగా వరుణ్ తేజ్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ సరసన ఓ చిత్రంలో అలాగే విష్ణు,రాజ్ తరుణ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'ఈడోరకం ఆడోరకం' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.వీటితోపాటుగా బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్న 'నేను నా బాయ్ ఫ్రెండ్స్' అనే చిత్రంలోనూ నటించనుంది.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







