తాప్సీ పన్ను కొత్త హీరోయినేం కాదు : అమితాబ్
- March 18, 2016
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ టాలీవుడ్ హీరోయిన్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు. ప్రస్తుతం ఆయన జాతీయ అవార్డు సాధించిన బెంగాలీ దర్శకుడు అనిరుద్ధా రాయ్ చౌదరి తెరకెక్కిస్తున్న 'పింక్' మూవీలో నటిస్తున్నారు. దుబాయ్ లో శుక్రవారం జరిగిన ఓ సినిమా అవార్డుల కార్యక్రమానికి హాజరైన అమితాబ్.. మీడియాతో కాసేపు సరదాగా ముచ్చటించారు. టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ లాంటి కొత్త వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ప్రశ్నలు అడిగారు.దానికి ఆయన స్పందిస్తూ, ''తాప్సీ పన్ను కొత్త హీరోయినేం కాదు.. ఆమె ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. అంతకుమించి మంచి ప్రొఫెషనల్'' అంటూ ఈ భామకు బిగ్ బీ మంచి మార్కులే వేశారు.అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య తారలుగా రూపొందుతున్న 'పింక్' చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయట. సెప్టెంబర్ 16న 'పింక్' చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సూజిత్ సర్కార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సూజిత్ ప్రొడక్షన్ లో తనకు ఇది మూడో చిత్రమని, గతంలో 'షోబైట్', 'పీకూ' మూవీలలో నటించానని చెప్పుకొచ్చారు.''అమితాబ్ బచ్చన్ పేరు తర్వాత వెండి తెరపై నా పేరు రాబోతుందనే విషయం తల్చుకుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది. ఆందోళనగా, ఆనందంగా.. ఇలా రకరకాల ఫీలింగ్స్ కలుగుతున్నాయి'' అని తాప్సీ అన్నారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







