గ్లోబల్ విలేజ్ సందర్శకులు డిటిసి యాప్ ద్వారా ట్యాక్సీలను సులువుగా బుక్ చేసుకోవచ్చు

- October 25, 2021 , by Maagulf
గ్లోబల్ విలేజ్ సందర్శకులు డిటిసి యాప్ ద్వారా ట్యాక్సీలను సులువుగా బుక్ చేసుకోవచ్చు

దుబాయ్: గ్లోబల్ విలేజ్ సందర్శకులు గతంలో ట్యాక్సీ కోసం కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చేది. డిటిసి (దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్) అందుబాటులోకి తెచ్చిన యాప్ ద్వారా సందర్శకులు ఇకపై తేలిగ్గా ట్యాక్సీలను బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 26 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు కీలక ఒప్పందాలు జరిగాయి. గ్లోబల్ విలేజ్ సీఈఓ బదర్ అన్వాహి, డిటిసి మన్సూర్ రహ్మా అల్ ఫలాసి ఈ వివరాల్ని వెల్లడించారు. ప్రత్యేకంగా గ్లోబల్ విలేజ్ సందర్శకుల కోసం ట్యాక్సీలను విరివిగా నడిపేందుకు ఒప్పందాలు కుదిరినట్లు చెప్పారు. లక్షలాదిమంది సందర్శకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com