'అన్ స్టాపబుల్ విత్ NBK’ ఫస్ట్ గెస్ట్ గా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ
- October 26, 2021
నందమూరి బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్ 4 నుంచి మొదలుకానున్న ఈ ప్రోగ్రాం లో ఫస్ట్ గెస్ట్ ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు అవుతున్నారు అనే వార్తలు ఇటీవల గుప్పుమన్న విషయం విదితమే.. అయితే ఈ ప్రోగ్రాం ఫస్ట్ గెస్ట్ గా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ హాజరయ్యారు. మోహన్ బాబు ని ఇంటర్వ్యూ చేసిన తరువాత సెట్ లో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఫస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఫన్ గా నడిచిందని, సెట్ లో బాలయ్య చాలా సరదాగా ఉన్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక