కరోనా దెబ్బకు రష్యా అతలాకుతలం
- October 29, 2021
మాస్కో:గత రెండేళ్లుగా ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన కరోనా ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నది.రష్యా, చైనా,న్యూజిలాండ్,బ్రిటన్,ఆస్ట్రేలియా దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి.రష్యాలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.నిన్నటి రోజున రష్యాలో ఏకంగా 40,096 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 1159 మంది కరోనాతో మృతి చెందారు.రష్యాలో అత్యధికంగా నమోదైన కేసులు ఇవేనని నిపుణులు చెబుతున్నారు.ప్రతిరోజూ వెయ్యికిపైగా మరణాలు సంభవిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.అక్టోబర్ 30 వ తేదీ నుంచి నవంబర్ 6 వ తేదీ వరకు వారం రోజులపాటు జీతంతో కూడిన సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది.రష్యాలో మొత్తం 14.6 కోట్ల మంది జనాభా ఉండగా, ఇందులో కేవలం 4.9 కోట్ల మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!