‘పుష్పక విమానం’ ట్రైలర్ విడుదలకు సన్నాహాలు
- October 29, 2021హైదరాబాద్: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం” ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 30న “పుష్పక విమానం” సినిమా ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరవుతున్నారు అల్లు అర్జున్. బన్నీ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవడం “పుష్పక విమానం” యూనిట్ మొత్తానికి సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ అంతా కలిసి థాంక్యూ బన్నీ అన్నా అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు.
“పుష్పక విమానం” సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్, ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థలు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.
“పుష్పక విమానం” చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు.
టెక్నికల్ టీమ్: సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర.
తాజా వార్తలు
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్