5-11 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ
- October 31, 2021
కువైట్: కరోనా ఎఫెక్ట్ పిల్లల పై పడకుండా ఉండేందుకు కువైట్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా వ్యాక్సిిన్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఐతే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఆదివారం నుంచి షురూ కానుంది. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్స్ ను ప్రారంభించినట్లు కువైట్ హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత క్రమంగా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని హెల్త్ మినిస్ట్రీ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోగానే పిల్లల పేరెంట్స్ కు గానీ గార్డియన్ గానీ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో వ్యాక్సినేషన్ డేట్, సెంటర్ పేరు ఉంటుందని అధికారులు చెప్పారు. పేరెంట్స్ తప్పకుండా తమ పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!