ఖతార్ వెళ్లే వలసదారులకు కొత్త సమస్య..
- October 31, 2021
దోహా: ఖతార్ వెళ్లే వలసదారులకు కొత్త సమస్య వచ్చి పడింది. కరోనా నేపథ్యంలో తమ దేశానికి వచ్చేవారికి ఖతార్ ప్రభుత్వం ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ క్వారంటైన్ నిబంధన వలసకార్మికులకు పెద్ద సమస్యగా మారింది. ఖతార్ వెళ్లేవారు తప్పనిసరిగా హోటళ్లలో 7రోజులు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాల్సి రావడంతో హోటల్ గదులకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా అక్కడి హోటళ్లలో అద్దె గదులు దొరకడం గగనంగా మారింది. ఇక క్వారంటైన్‌కు అవసరమైన హోటల్ గది ఖాళీగా ఉంటేనే వీరి ప్రయాణానికి అనుమతి లభిస్తోంది. విమానయాన సంస్థలు కూడా హోటల్ గది దొరికినట్లు ఆధారం చూపిస్తేనే టికెట్లు ఇస్తున్నాయి. మన దగ్గర నుంచి ప్రస్తుతం ఆ దేశానికి విమానాలు బాగానే నడుస్తున్నా.. అక్కడికి వెళ్లిన తరువాత 7 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండటానికి అవసరమైన హోటల్ గదులు దొరకడం లేదు. దీంతో వలసదారులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!