అబుధాబిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు..
- November 10, 2021
యూఏఈ: అబుధాబిలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో బుధవారం ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ వర్షాలు పడతాయని, దీని కారణంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మహ్మద్ బిన్ జాయెద్ సిటీలో తేలికపాటి వర్షం కురవగా.. సాదియత్ ద్వీపంలోని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రహదారిపై మోస్తరు నుండి భారీ వర్షం పడింది. అలాగే నగరంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న నివాసితులకు ఉపశమనం లభించింది. “పలు ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. ముఖ్యంగా ద్వీపం, కొన్ని ఉత్తర, తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో మోస్తరు వర్షపాతం కురిసే అవకశం ఉంది. ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల నమోదు అవుతుంది. ” అని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) తెలిపింది. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత రస్ అల్ ఖైమా విమానాశ్రయంలో మంగళవారం యూఏఈ స్థానిక కాలమానం ప్రకారం 12:00 గంటలకు 35°C గా నమోదైంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్