'పుష్ప' లో అనసూయ లుక్ అదరహో
- November 10, 2021
సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మిస్తున్న ఈ సినిమాలో, నాయకా నాయికలుగా అల్లు అర్జున్ - రష్మిక నటిస్తున్నారు.
ఈ సినిమా నుంచి 'పుష్పరాజ్' గా బన్నీ లుక్ వదిలిన కొంత గ్యాప్ తరువాత ఫాహద్ ఫాజిల్ లుక్ ను వదిలారు. ఆ తరువాత శ్రీవల్లి గా రష్మిక లుక్ ను రిలీజ్ చేశారు. ఇక రీసెంట్ గా 'మంగళం శ్రీను' పాత్రలో సునీల్ ను పరిచయం చేస్తూ ఆయన లుక్ ను రివీల్ చేశారు. సునీల్ ను ఆ తరహా లుక్ తో ఊహించని నెటిజన్లు షాక్ అయ్యారు.
సునీల్ పాత్ర ఎలా ఉండనుందా అనే ఆసక్తి అందరిలోను పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి 'దాక్షాయణి'పాత్రలో అనసూయను పరిచయం చేస్తూ ఆమె లుక్ ను వదిలారు. ఈ పోస్టర్లో అనసూయ మాస్ లుక్ తో కనిపిస్తోంది. ఆమె లుక్స్ ను బట్టి ఆమె పోషించినది నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర అనిపిస్తోంది. మరి ఈ లుక్ తో తెరపై ఆమె ఏ రేంజ్ లో హల్ చల్ చేస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..