Dh80 కే పీసీఆర్ టెస్టు
- November 10, 2021
దుబాయ్: ఇప్పుడు అతి తక్కువ ధరకే పీసీఆర్ టెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది 'రైట్ హెల్త్ గ్రూప్'. దుబాయ్‌లోని జాఫిలియా ప్రాంతంలోని ఇమ్మిగ్రేషన్ అథారిటీ కార్ పార్కింగ్‌లో కార్మికులకు చౌకగా పిసిఆర్ పరీక్షలను అందించడానికి పెద్ద టెంట్‌ను ఏర్పాటు చేశారు.
కార్మికులు ఈ కేంద్రంలో పీసీఆర్ టెస్ట్ కొరకు Dh80 చెల్లించవలసి ఉంటుంది. క్లినిక్‌లు సాధారణంగా Dh150 లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి. అయితే, ఈ కేంద్రం వద్ద మాత్రం కార్మికులకు Dh80 వసూలు చేస్తారు.స్వదేశానికి ప్రయాణం కొరకు, హాలిడేస్ కొరకు, ఉద్యోగాలు మారడానికి లేదా వారి వీసా మార్చడానికి ముందు కోవిడ్-19 కోసం పరీక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ పధకం ప్రజలకు సులభతరం చేస్తుందని తక్కువ-ఆదాయ కార్మికుల కోసం చౌకైన వైద్య క్లినిక్‌లను నడుపుతున్న రైట్ హెల్త్ గ్రూప్ హెడ్ డాక్టర్ సంజయ్ పైతాంకర్ అన్నారు.

ప్రభుత్వ సర్వీసులు అయిన అబుదాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ అయిన SEHA చే నిర్వహించబడుతున్న ఆసుపత్రులలో దుబాయ్‌లో పీసీఆర్ పరీక్షలకు అతి తక్కువ ధర Dh50. "మా ఛార్జీ సాధారణ ప్రయివేట్ క్లినిక్‌ల కంటే తక్కువగా ఉంది కాబట్టి బర్ దుబాయ్, కరామా ప్రాంతాలలో ఉండే బ్యాచిలర్లు మరియు పరీక్షించాల్సిన కుటుంబాల నుండి ఆసక్తి ఉంటుంది" అని పైతాంకర్ అన్నారు.
ఈ కేంద్రం నవంబర్ 9న అధికారికంగా ప్రారంభించబడింది. ఇక్కడ రోజుకు 1,000 పిసిఆర్ పరీక్షలను నిర్వహించే సామర్ధ్యం ఉంది. ఇది ప్రతిరోజూ ఉదయం 7 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ గేటు వద్ద ఈ కేంద్రం ఏర్పాటు చేయబడింది మరియు ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలను ఉపయోగించే వేలాది మంది ప్రజలకు సేవలు అందిస్తుంది ఈ కేంద్రం.

దుబాయ్‌లోని జాఫిలియా ప్రాంతంలోనే కాకుండా అల్ క్వోజ్ మరియు జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో రెండు గుడారాలను కూడా నడుపుతోంది రైట్ హెల్త్ గ్రూప్.
తాజా వార్తలు
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!
- సోహార్ టైర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆఫ్రికాకు చెందిన మహిళలు అరెస్ట్..!!
- ఖతార్ మధ్యవర్తిత్వానికి మద్దతు ఇస్తుంది.. అన్నింటికి ఖతార్ సిద్ధం..!!
- యూఏఈ పర్యటనలో మరణించిన భారతీయురాలు..30 రోజుల తర్వాత స్వదేశానికి డెడ్ బాడీ తరలింపు..!!
- యుద్ధం పై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్‌పై దాడులకు బ్రేక్!
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..









