షెడ్యూల్డ్ విమానాల పునరుద్ధరణ దిశగా ఇండియా: విదేశాంగ మంత్రి

- November 13, 2021 , by Maagulf
షెడ్యూల్డ్ విమానాల పునరుద్ధరణ దిశగా ఇండియా: విదేశాంగ మంత్రి

యూఏఈ: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్, షెడ్యూల్డ్ విమానాల పునరుద్ధరణ దిశగా భారత ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రి, ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో ఇండియన్ పెవిలియన్ సందర్శించారు. టూర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ జై శంకర్ మాట్లాడుతూ, షెడ్యూల్డ్ విమానాల పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ పాండమిక్‌ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొందని ఆయన వివరించారు. ఎకానమీ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటోందని చెప్పారాయన. యూఏఈ, భారతదేశానికి అత్యంత నమ్మకమైన మిత్రదేశమని చెప్పారు. యూఏఈలో భారత రాయబారి పవన్ కపూర్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ పొందిన భారత ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ రద్దు చేయాల్సిందిగా కోరుతూ యూఏఈ నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్స్ మేనేజిమెంట్ అథారిటీని భారత అధికారులు సంప్రదించినట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com