విమానంలోనే దర్జాగా స్మోకింగ్...ఆంధ్ర వ్యక్తి అరెస్ట్
- November 15, 2021
చెన్నై: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. బస్సులు, రైళ్లలో పొగతాాగరాదు అని చూసే ఉంటాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా విమానంలోనే స్మోకింగ్ చేసి కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన కువైట్ నుంచి చెన్నై వచ్చిన విమానంలో జరిగింది. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ షెరీఫ్(57).. కువైట్ నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో చెన్నైకి బుధవారం బయలుదేరాడు. అందులో మొత్తం 137 మంది ప్రయాణికులు ఉన్నారు. తన దుస్తుల్లో దాచి సిగరెట్లను అక్రమంగా విమానంలోకి తీసుకొచ్చాడు. ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన క్రమంలో వాటిని తీసి పొగతాగటం ప్రారంభించాడు. స్మోకింగ్ చేయొద్దని తోటి ప్రయాణికులు చెప్పినా వినలేదు. దాంతో విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.ఎయిర్ హోస్టెస్ వచ్చి సిగరెట్ తాగొద్దని చెప్పినా వారి మాట వినకుండా పొగ తాగటం కొనసాగించాడు. క్యాబిన్ సిబ్బంది, ఎయిర్ హోస్టెస్‌తో వాగ్వాదానికి కూడా దిగాడు.చెన్నైలో విమానం దిగిన వెంటనే భద్రతా సిబ్బంది షెరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..