వరుణ్ తేజ్ గని టీజర్..
- November 15, 2021
మెగా హీరో వరుణ్‌తేజ్ ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. అందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇక తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వరుణ్ వాయిస్ ఓవర్‌లో వచ్చిన కొన్ని మాటలు బాగున్నాయి. నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఒక్కరి కథలో కష్ఠాలు ఉంటాయి.. కన్నీళ్లు ఉంటాయి.. కోరికలు ఉంటాయి.. కోపాలు ఉంటాయి.. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అవ్వాలని ఉంటుంది. అయితే ఛాంపియన్ అయ్యేది ఒక్కడే.. ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి.. అంటూ సాగో వాయిస్ ఓవర్ నెటిజన్స్‌ను ఆకర్షిస్తోంది. ఇక చివరగా.. ఆటలో ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటాం.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు.. అంటూ డైలాగ్ వదిలారు. గని సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. వరుణ్ ఫిజిక్ అదిరిందని అంటున్నారు నెటిజన్స్.
గనిలో వరుణ్ తేజ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. గెస్ట్ రోల్స్‌లో సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కూడా నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించనున్నారు. గని సినిమాను అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!