ప్రపంచాన్ని ఊపేసిన ‘స్క్విడ్‌గేమ్’ ఇప్పుడు తెలుగులో
- November 18, 2021ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ చేస్తున్న ‘స్క్విడ్‌గేమ్’ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచంలో ఇప్పటి వరకూ అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ గా ‘స్క్విడ్ గేమ్’ చరిత్రకెక్కింది. ఈ సిరిస్ ద్వారా నెట్ ఫ్లిక్స్ భారీగా ఖతాదార్లని దక్కించుకున్నట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మరింతగా జనానికి చేరువ చేసేందుకు ‘స్క్విడ్‌గేమ్’ సిరీస్ ను స్థానిక భాషల్లోనూ విడుదల చేసేందుకు సిద్ధమయింది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. అందులో మొదటగా తమిళ, తెలుగు ఆడియోను జతచేయబోతున్నారు. తెలుగులో స్ట్రీమ్ చేసేందుకు ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాల్ని కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.
తెలుగు వెర్షన్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది. ఈ సిరీస్ చాలా ఆసక్తికరమైన పాయింట్ తో తెరకెక్కింది. ఇందులో కొన్ని గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. అందులో ఓడిపోతే చనిపోవడమే. అందులో గెలిచిన వారికి కోట్లు ఇస్తామంటూ కొందరిని బలవంతంగా ఆడిస్తుంటారు. ఇంతకీ ఆ గేమ్స్ ఏంటి? వాటిని ఎలా ఆడాలి అనే విషయాలు తెలియాలంటే.. ‘స్క్విడ్‌గేమ్’ సిరీస్ చూడాల్సిందే. కొరియా భాషలో వచ్చిన ఈ సిరీస్ .. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!