కమల్ హసన్ కు కరోనా....
- November 22, 2021
చెన్నై: విలక్షణ నటుడు కమల్ హసన్ కరోనా బారిన పడ్డాడు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన కమల్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీనితో పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది. 'ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన నాకు కాస్త దగ్గు, జలుబు వచ్చింది. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడ్డాను. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే... మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. దయ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి' అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు కమల్. కరోనా నుంచి కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్