బహ్రెయిన్‌ గ్రాండ్‌ పిక్స్‌కి కౌంట్‌ డౌన్‌

- March 22, 2016 , by Maagulf
బహ్రెయిన్‌ గ్రాండ్‌ పిక్స్‌కి కౌంట్‌ డౌన్‌

2016 ఫార్ములా 1 గల్ఫ్‌ ఎయిర్‌ బహ్రెయిన్‌ గ్రాండ్‌ పిక్స్‌ వైపు ప్రపంచం దృష్టి సారించింది. మార్చ్‌ 31న ప్రారంభమయ్యే ఈ ఫెస్టివ్‌ కోసం అప్పుడే హంగామా మొదలైంది. పది రోజుల ముందు నుంచే ఫార్ములా వన్‌ గ్రాండ్‌ పిక్స్‌ అభిమానులు ఈ ఈవెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. మార్చ్‌ 31న మొరాకో ఆర్టిస్ట్‌ సాద్‌ లమ్‌జార్డ్‌ కాన్సెర్ట్‌ జరుగుతుంది. ఆహూతుల్ని అలరించేందుకు ఈ అరబిక్‌ మ్యూజిక్‌ స్టార్‌ పలు హిట్‌ ఆల్బమ్స్‌తో సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్‌ 1న రెగ్గాయ్‌ లెజెండ్‌ జిమ్మీ క్లిఫ్‌, విల్‌ సూపర్‌ స్టార్‌ డిజెస్‌ ఆగ్వ్‌ఎల్‌ ఇంగ్రాసో కాన్సెర్ట్‌, ఏప్రిల్‌ 2న ఆర్టిస్ట్‌ మరియు ప్రొడ్యూసర్‌ అవిసి ఆహతుల్ని అలరిస్తారు. మెయిన్‌ గ్రాండ్‌ స్టాండ్‌ టిక్కెట్‌ ధరని 150 బహ్రెయినీ దినార్స్‌గా నిర్ణయించారు. బాటెల్కో గ్రాండ్‌ స్టాండ్‌ టిక్కెట్‌ ధర 120 బహ్రెయినీ దినార్స్‌. టర్న్‌ వన్‌ గ్రాండ్‌ స్టాండ్‌ 100 బహ్రెయినీ దినార్స్‌, యూనివర్సిటీ అండ్‌ విక్టరీ గ్రాండ్‌ స్టాండ్స్‌ టిక్కెట్‌ ధర 60 బహ్రెయినీ దినార్స్‌. 12 ఏళ్ళ లోపు 3 ఏళ్ళ పైన వయసున్నవారికి సగం ధర, 3 ఏళ్ళ లోపువారికి ఉచిత ప్రవేశం. స్కూల్‌ విద్యార్థులకు (13 నుంచి 17 ఏళ్ళ వయసు వారికి) 25 శాతం డిస్కౌంట్‌. సీఇయర్‌ సిటిజన్స్‌కి 60 శాతం డిస్కౌంట్‌, యూనివర్సిటీ స్టూడెంట్స్‌కి 10 శాతం డిస్కౌంట్‌ ఉంటుంది. టిక్కెట్లు బహ్రెయిన్‌ సిటీ సెంటర్‌ లేదా సీప్‌ మాల్‌ (సీఫ్‌ డిస్ట్రిక్ట్‌) వద్ద బిఐసి స్టాండ్స్‌లో లభ్యమవుతాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com