300 ఏళ్ళ నాటి సమాధి రాతిని పరిరక్షించిన బహ్రెయినీ

- December 04, 2021 , by Maagulf
300 ఏళ్ళ నాటి సమాధి రాతిని పరిరక్షించిన బహ్రెయినీ

బహ్రెయిన్: హుస్సేన్ అబ్దుల్లా అల్ ఒలాయ్‌వాత్ అనే వ్యక్తి తాను కనుగొన్న 300 ఏళ్ళనాటి సమాధి రాతిని అత్యంత జాగ్రత్తగా పరిరక్షించాడు. ఆ రాయి తాలూకు చారిత్రక నేపథ్యాన్ని గుర్తించి, పరిరక్షించిన హుస్సేన్ అబ్దుల్లా, దాన్ని బహ్రెయిన్ నేషనల్ మ్యూజియంకి తరలించేందుకు సిద్ధమయ్యాడు. సరైన ప్రాంతంలో దాన్ని వుంచి, అందరికీ కనిపించేలా చేయాలన్నది ఆయన సంకల్పం. ఈ రాయి ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ కల్చర్ మరియు ఆర్ట్స్ డైరెక్టర్ జనరల్ షేకా హలా బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా ఈ విషయంపై స్పందిస్తూ, హుస్సేన్ అబ్దుల్లాని అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com