ఒమన్‌లో పర్యటించనున్న సౌదీ ప్రిన్స్ సల్మాన్
- December 05, 2021
ఒమన్: సౌదీ అరేబియా (KSA) క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ HRH ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఒమన్ లో పర్యటించనున్నారు. సోమవారం ఆయన ఒమన్ సుల్తానేట్ను సందర్శించనున్నారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ప్రకటన విడుదల చేసింది. ‘ఇరు దేశాల నడుమ సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో ఈ ఏడాది జులైలో కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా (KSA) మెజెస్టీ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఒమన్ లో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా కస్టోడియన్ ఆఫ్ హోలీ మస్జిద్స్ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అందులో భాగంగానే డిసెంబర్ 6న ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఒమన్ సుల్తానేట్‌లో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటనలో పలు కీలక అంశాలపై పలువురితో సమావేశమవుతారు. ఈ పర్యటన రెండు దేశాల ప్రయోజనాలను, సంపన్నమైన భవిష్యత్తు కోసం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది.’ అని వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!