యూఏఈలో కొత్త రైల్వే ప్రాజెక్ట్ లు.. లక్షల మంది ప్యాసింజర్స్ కి బెనిఫిట్
- December 06, 2021
యూఏఈ: కొత్త రైల్వే ప్రాజెక్ట్ ను ప్రారంభించినట్లు యూఏఈ ప్రకటించింది. డిసెంబర్ 2న గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్న తర్వాత ‘యూఏఈ న్యూ 50’లో భాగంగా ప్రకటించిన మొదటి ప్రాజెక్ట్ ఇది. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. “ఈ ప్రాజెక్ట్ మా జాతీయ ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి మరింత ముందుకు తీసుకుపోతుంది. యూఏఈని ఒక ఆర్థిక గమ్యస్థానంగా స్థాపించడంలో ఉపయోగపడుతుంది. యూఏఈ న్యూ 50 ని ప్రారంభించడం సంతోషంగా ఉంది.' అని షేక్ మహమ్మద్ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ యూనియన్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. యూఏఈ రైల్వే ప్రోగ్రామ్ ద్వారా సంవత్సరానికి 36.5 మిలియన్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చనుంది. ఈ రైల్వే ప్రాజెక్ట్ యూఏఈలోని ముఖ్యమైన 11 నగరాలు, ఇతర ప్రాంతాలను కలుపుతూ నిర్మించనున్నారు. 50 బిలియన్ దిర్హామ్‌ల పెట్టుబడితో ప్రారంభించబడిన ఇది 200 బిలియన్ దిర్హామ్‌లకు పైగా రాబడిని ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్