సోనూసూద్‌కు మరో షాక్...
- December 06, 2021
ముంబై: ప్రముఖ నటుడు, హెల్పింగ్ స్టార్ సోనూసూద్‌కు మరో షాక్ తగిలింది. గెస్ట్ హౌస్ కోసం నిర్మించిన ఆరు అంతస్తుల భవనంలో సోనూసూద్ హోటల్ నడుపుతున్నారని… కోర్టు ఆదేశాల ప్రకారం సదరు హోటల్‌ను నివాస భవంతి మార్చుతానని మాట ఇచ్చిన ఆయన ఇంకా నిలబెట్టుకోలేదని ముంబై బృహన్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై సోనూసూద్ వెంటనే స్పందించాలని నోటీసుల్లో బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు గుర్తుచేశారు.
కాగా మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేష్ అనే వ్యక్తి గతంలో సోనూసూద్‌పై బీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సోనూసూద్ రెసిడెన్షియల్ బిల్డింగ్‌ను హోటల్‌గా మార్చాడని… ఇది అక్రమం కనుక ఆ బిల్డింగ్‌ను కూల్చివేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ అంశంపై 2021 ఆరంభంలోనే బీఎంసీ అధికారులు, సోనూసూద్ మధ్య సంప్రదింపులు జరగ్గా… ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఆ సమయంలో బీఎంసీ అధికారులు చెప్పినట్లు నడుచుకుంటానని తెలుపుతూ సోనూసూద్ లెటర్ ఇవ్వగా వివాదం సద్దుమణిగింది. అయితే ఇప్పటివరకు సోనూసూద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదంటూ తాజాగా బీఎంసీ అధికారులు నోటీసులు పంపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!