యూఏఈ: వారంలో నాలుగున్నర రోజులు మాత్రమే ‘వర్క్’.!
- December 07, 2021
అబుధాబి: జనవరి 1 నుంచి వారంలో నాలుగున్నర రోజుల్ని మాత్రమే పని దినాలుగా గుర్తించనున్నారు. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.30 నిమిషాల వరకు పని గంటలు కొనసాగుతాయి. శుక్రవారం మాత్రం ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటలతో పని సమయం ముగుస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలకు ఈ కొత్త పని సమయాలు వర్తిస్తాయి. శుక్రవారం ప్రార్థనలు 1.15 గంటల నుంచి వుంటాయి. శుక్రవారం ఇంటి నుంచి పని చేయడానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు వెసులుబాటు వుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వారంలో ఐదు రోజుల పని దినాలుండగా, అంతకంటే తక్కువ పని దినాల్ని ప్రకటించిన తొలి దేశంగా యూఏఈ రికార్డులకెక్కింది. ఉద్యోగుల పని భారాన్ని తగ్గించడం ద్వారా పనిలో సామర్థ్యాన్ని పెంచడం ఈ ఆలోచన తాలూకు ఉద్దేశ్యం. ఆర్థిక కోణంలో చూసినా, ఇది ఎంతో మేలైన విధానంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అంతర్జాతీయ వ్యాపార సంబంధాల్ని మరింత మెరుగు చేసేలా ఈ కొత్త పని దినాలు యూఏఈకి కొత్త వేగాన్ని ఇవ్వనున్నాయి. రియల్ టైమ్ ట్రేడింగ్, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, కమ్యూనికేషన్స్ ఆధారిత లావాదేవీలు, బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సంస్థలు.. ఇలా అన్ని విభాగాల్లోనూ కొత్త విధానం పెను మార్పులకు కారణం కానుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







