జనవరి 26న ‘గాడ్సే’!
- December 08, 2021
హైదరాబాద్: గాడ్సే అనగానే అందరికీ గుర్తొచ్చేది గాంధీ హంతకుడే! అయితే అదే పేరుతో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఓ తెలుగు సినిమా తీస్తున్నారు. గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్సే’ చిత్రంలో సత్యదేవ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. బుధవారంతో ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యాణ్ తెలియచేస్తూ, ”ఇప్పటికే మూవీ రషెస్ చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా సత్యదేవ్ కు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇలాంటి ఓ సినిమాను నిర్మాతగా ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. అందరినీ మేల్కొలిపే మంచి చిత్రం ఇది. ఈ మూవీ తర్వాత దర్శకుడు గోపీగణేశ్ తో మరో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. ఈ ‘గాడ్సే’ చిత్రాన్ని వచ్చే యేడాదిన జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నాను” అని అన్నారు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!