ప్రైవేటు ఇళ్ళ అద్దెలపై నియంత్రణకై ఎంపీ ప్రతిపాదన
- December 08, 2021
కువైట్ సిటీ: ఎంపీ మర్జౌక్ అల్ ఖలీఫా, ఓ ప్రతిపాదనని ప్రముఖ ప్రాంతాల్లోని ప్రైవేటు ఇళ్ళ అద్దెలకు సంబంధించి పెట్టడం జరిగింది. అనూహ్యంగా పెరుగుతున్న అద్దెలపై నియంత్రణ ఈ ప్రతిపాదన తాలూకు ఉద్దేశ్యం.క్యాపిటల్ మరియు హవాలీ గవర్నరేట్లలో చదరపు మీటరుకి 2.5 కువైటీ దినార్లకు మించకుండా అద్దె వుండాలన్నది ఎంపీ ప్రతిపాదన. అలాగే, ఫర్వానియా, జహ్రా, అహ్మది మరియు ముబారక్ అల్ కబీర్ ప్రాంతాల్లో చదరపు మీటరుకి 2 కువైటీ దినార్లకు మించకూడదని ఆయన తన ప్రతిపాదనలో పేర్కొన్నారు. మోడల్ ప్రాంతాల్లోని ప్రైవేటు ఇళ్ళకే ఈ ప్రతిపాదన రూపొందించారు. ప్రధానంగా ఈ ఇళ్ళలో కువైటీలే నివసిస్తారు. వలసదారులు ఇన్వెస్టిమెంట్ భవనాల్లో నివసిస్తుంటారు. ఆ భవనాలకు ఈ ప్రతిపాదన వర్తించదు. నేషనల్ అసెంబ్లీ ఆమోదం పొంది, ప్రభుత్వం నుంచి ఆమోదం పొందితే తప్ప ఇది చట్టంగా మారదు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!