జనవరి 26న ‘గాడ్సే’!

- December 08, 2021 , by Maagulf
జనవరి 26న ‘గాడ్సే’!

హైదరాబాద్: గాడ్సే అనగానే అందరికీ గుర్తొచ్చేది గాంధీ హంతకుడే! అయితే అదే పేరుతో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఓ తెలుగు సినిమా తీస్తున్నారు. గోపీ గణేశ్‌ పట్టాభి దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్సే’ చిత్రంలో సత్యదేవ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. బుధవారంతో ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యాణ్ తెలియచేస్తూ, ”ఇప్పటికే మూవీ రషెస్ చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా సత్యదేవ్ కు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇలాంటి ఓ సినిమాను నిర్మాతగా ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. అందరినీ మేల్కొలిపే మంచి చిత్రం ఇది. ఈ మూవీ తర్వాత దర్శకుడు గోపీగణేశ్ తో మరో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. ఈ ‘గాడ్సే’ చిత్రాన్ని వచ్చే యేడాదిన జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నాను” అని అన్నారు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com