కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
- December 09, 2021
హైదరాబాద్: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ మరో మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలో గురువారం ఉదయం వరకు 4 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయింది. ఈ ఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ఈ ప్రక్రియ మొదలుపెట్టిన 165 రోజుల్లో కోటి డోసులు, 233 రోజుల్లోనే రెండు కోట్ల డోసులను, 260 రోజుల్లోనే మూడు కోట్ల డోసులను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర జనాభాలో 18 ఏళ్లు నిండిన 94% మందికి ఫస్ట్ డోస్, 50% మందికి సెకండ్ డోస్ అందిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు.
సీఎం కేసీఆర్ సహకారం, కరోనా నిబంధనల వల్లే తెలంగాణలో నాలుగు కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ సాధ్యమైందని సోమేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు వైద్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. మిగతా కోటి డోసుల పంపిణీని మరో నెలలో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అర్హులైన 18 లక్షల మంది ఇంకా కరోనా వ్యాక్సిన్లు తీసుకోలేదని సమాచారం.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక