సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటనతో సంబంధాలు మరింత బలోపేతం: కింగ్ హమాద్
- December 11, 2021
ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, బహ్రెయిన్ పర్యటన ముగించుకున్నారు. ఈ పర్యటనలో నిర్వహించిన పలు భేటీల ద్వారా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగే దిశగా కీలక చర్చలు జరిగాయి. గల్ఫ్ ఐక్యత, వ్యాపార సంబంధాల పెంపు వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. బహ్రెయిన్ పర్యటన తనకు చాలా ఆనందాన్నిచ్చిందని క్రౌన్ ప్రిన్స్ ట్వీట్ చేశారు. కాగా, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మరియు ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా (క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్), ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌కి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కింగ్ మాట్లాడుతూ, సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటనతో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు పడతాయని చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!