దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్: ఫైర్ వర్క్స్, డ్రోన్ షోలు..
- December 15, 2021
దుబాయ్: డిసెంబర్ 15న అంగరంగ వైభవంగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (డిఎస్ఎఫ్) ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. బుర్జ్ పార్క్ వద్ద ప్రత్యేక కార్యక్రమాల్ని రూపొందించారు. బుర్జ్ ఖలీఫా లైట్ షో, డాన్సింగ్ ఫౌంటెయిన్స్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. జనవరి 30 వరకు మొత్తం 47 రోజులపాటు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ కొనసాగుతుంది. కాగా, షో కోసం 75 దిర్హాములతో టిక్కెట్ల ధరలు ప్రారంభమవుతాయి. ఈ వేడకల్లో డ్రోన్ లైట్ షో మరో ప్రధాన ఆకర్షణ. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుంచి 9.30 నిమిషాల వరకు ఈ షో కొనసాగుతుంది. గురువారం, డిసెంబర్ 16న దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్, అల్ సీఫ్, దుబాయ్ క్రీక్, దుబాయ్ ఫ్రేమ్ మరియు లా మెర్ వద్ద ఫైర్ వర్క్స్ ప్రదర్శన వుంటుంది. డిసెంబర్ 22 వరకు ప్రతిరోజూ ఈ షో నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్







