.'మేము సైతం' కార్యక్రమంలో భాగంగా మోహన్‌బాబు ఇడ్లీలు అమ్మారు..

- March 24, 2016 , by Maagulf
.'మేము సైతం' కార్యక్రమంలో భాగంగా మోహన్‌బాబు  ఇడ్లీలు అమ్మారు..

 సీనియర్‌ తెలుగు నటుడు మంచు మోహన్‌బాబు ఇడ్లీలు అమ్మారు. తెలుగులో 500 పైగా చిత్రాల్లో నటించిన మోహన్‌బాబు ఇడ్లీలు అమ్మడం ఏంటి అనుకుంటున్నారా? ఇదేదో సినిమా షూటింగ్‌ కోసమని పొరబడకండి.'మేము సైతం' కార్యక్రమంలో భాగంగా మోహన్‌బాబు ఈ పని చేశారు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డుపై మోహన్‌బాబు ఇడ్లీలు అమ్మారు. ఈ విషయాన్ని శ్రీ విద్యానికేతన్‌ కళాశాల తమ ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. మోహన్‌బాబు ఇడ్లీలు అమ్ముతుండగా తీసిన ఫొటోలను పోస్టు చేసింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'మేము సైతం' సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు.ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే నటీనటులు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కూరగాయలు అమ్మగా, రానా కూలీ అవతారం ఎత్తారు. అక్కినేని అఖిల్‌ ఆటో నడపగా, శ్రియ సూపర్‌ మార్కెట్‌లో సేల్స్‌ గర్ల్‌గా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com