జెడ్డా సెంట్రల్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ప్రిన్స్ సల్మాన్
- December 18, 2021
సౌదీ: జెడ్డా సెంట్రల్ ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్ ను శుక్రవారం ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును గతంలో న్యూ జెడ్డా డౌన్‌టౌన్ అని పిలిచేవారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును SR75 బిలియన్ డాలర్లతో ఎర్ర సముద్రానికి దగ్గరలో 5.7 మిలియన్ చదరపు మీటర్లలో నిర్మించనున్నారు. ఈ జెడ్డా సెంట్రల్ ప్రాజెక్ట్ 2030 నాటికి SR47 బిలియన్ల అదనపు విలువను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా ఒపెరా హౌస్, మ్యూజియం, స్పోర్ట్స్ స్టేడియం, ఓషనేరియం అనే నాలుగు ప్రముఖ ల్యాండ్‌మార్క్ లను ఏర్పాటు చేయనున్నారు. టూరిజం, వినోదం, సంస్కృతి, స్పోర్ట్స్ తో సహా ఆర్థిక రంగాల అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ దోహదం చేయనుందని అధికారులు తెలిపారు. లోకల్, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







