కొత్త సంవత్సర వేడుకలు: గ్లోబల్ విలేజ్‌లో 8 ఫైర్ వర్క్ ప్రదర్శనలు
- December 18, 2021
దుబాయ్: కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా గ్లోబల్ విలేజ్ వద్ద మ్యూజికల్ ఫైర్ వర్క్స్ మరియు సాంస్కృతిక ప్రదర్శనల్ని సందర్శకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8 వేర్వేరు ప్రాంతాలతో సరిసమానంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. గ్లోబల్ విలేజ్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ షౌన్ కోమెల్ మాట్లాడుతూ, 2022 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం ఎనిమిదిసార్లు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా ఈ ఫైర్ వర్క్స్ కార్యక్రమాలు వుండబోతున్నాయి. ఆస్ట్రేలియా నుంచి ఫిలిప్పీన్స్, థాయిలాండ్, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్.. ఇలా ఆయా దేశాల్లో వేడుకలకు అనుకూలంగా ఆయా సమయాల్లో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తారు. రష్యాలో వేడుకలకు అనుగుణంగా 8వ కార్యక్రమం (ఫైర్ వర్క్స్ ప్రదర్శన) వుంటుంది. మహిళలకు, కుటుంబాలతో వచ్చేవారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు వున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..