అల్ కూజ్ ట్రాఫిక్ సామర్థ్యాన్ని గంటకు 1,250 వాహనాలకు పెంచేలా ఆర్టీయే కొత్త ప్రాజెక్టు

- December 18, 2021 , by Maagulf
అల్ కూజ్ ట్రాఫిక్ సామర్థ్యాన్ని గంటకు 1,250 వాహనాలకు పెంచేలా ఆర్టీయే కొత్త ప్రాజెక్టు

దుబాయ్: దుబాయ్ అల్ కూజ్ ట్రాఫిక్ సామర్థ్యాన్ని గంటకు 1,250 వాహనాలకు పెంచేలా కొత్త ప్రాజెక్టుని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్టీయే) కాంట్రాక్టుని ఇవ్వడం జరిగింది. అంతర్గత రోడ్లను 16 కిలోమీటర్ల మేర పెంచేలా ఈ ప్రాజెక్టుని రూపొందిస్తున్నారు. అల్ ఖయిల్ రోడ్డు మరియు మేదాన్ రోడ్డు మధ్యఅ ల్ కోజ్ 2 ప్రాంతానికి వీలుగా దీన్ని అభివృద్ధి చేస్తారు. అలాగే, ఆర్టీయే నాద్ అల్ షెబా 2 ప్రాంతానికి సంబంధించి 12 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. సమాంతర పార్కింగ్, వీధి లైట్లు, వర్షపు నీటికి సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్.. వంటివాటి నిర్మాణం చేపడతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com